Tuesday, 18 November 2025

ధర్మరాజు మహాప్రస్థానము

ధర్మరాజు కొంచెం సర్దుకున్నాడు.ఎంతటి వారైనా కాలగమనం పాటించాల్సిందే కదా! ఆ తరువాత ధర్మరాజు మనుమడు,పరీక్షిత్తునకు హస్తినాపురములో పట్టాభిషేకము చేసాడు.అనిరుద్ధుని పుత్రుడు వజ్రుడు.అతనికి మధురను పట్టము కట్టాడు.విరాగి అయ్యాడు.ధర్మరాజు మనసులో పరాత్పరుడైన ఆ పరంథాముడిని తలచుకుంటూ ఉత్తర దిక్కుగా పయనించాడు.అతని తమ్ముళ్ళు అయిన భీముడు,అర్జునుడు,నకులుడు,సహదేవుడు కూడా సకల ధర్మాలను ఆచరించి పరిశుద్ధులు అయ్యారు. అందరూ పరమపదించారు. విదురుడు కూడా ప్రభాస తీర్థమున శరీరత్యాగం చేసాడు.అతను యముడు కాబట్టి,తన స్వస్థానం అయిన యమపురికి పోయాడు. ద్రౌపది మనసులో శ్రీకృష్ణుడినే ఆరాథిస్తూ కైవల్యం పొందింది. పరీక్షిత్తు గొప్ప భగవద్భక్తుడు.అతను ధర్మానికి కొమ్ము కాస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు.ఉత్తరుడి కుమార్తె అయిన ఐరావతిని పెండ్లి చేసుకున్నాడు.వారికి జనమేజయుడుతో కలిపి నలుగురు కుమారులు కలిగారు.అతడు కృపాచార్యుని గురువుగా గ్రహించి గంగా తీరములో మూడు అశ్వమేథ యాగాలు చేయడంలో సఫలీకృతుడు అయ్యాడు.

No comments:

Post a Comment