Saturday, 25 October 2025
భీష్ముడి శ్రీకృష్ణ స్తుతి
భీష్ముడికి చాలా సంతోషంగా ఉంది,శ్రీకృష్ణుడు తనను చూసేదానికి వచ్చాడని.ఆ ఆనందాన్ని ఇలా బయటపెట్టాడు.హే కృష్ణా!నీలమేఘ శ్యాముడివి.ముల్లోకాలను మోహ సముద్రములో ఓలలాడిస్తావు.నల్లని ముంగురులతో నీ ముఖం మనోహరంగా మెరిసి పోతుంది.నీవు కట్టిన వస్త్రాలు లేత సూర్యుని రంగులో వెలిగిపోతున్నాయి.ఎల్లప్పుడూ అర్జునుడి జతలోనే ఉంటావు.అలానే నా మనోఫలకంపైన స్థిరంగా ఉంటావు.
అర్జునుడు మనసు కలత పడి యుద్ధం ఛేయనంటే,అతను మనసు కుదుట పడేలా చేసావు.సుద్దులూ,బుద్ధులూ చెప్పి కార్యోన్ముఖుడిని చేసావు.అలాంటి నీ నామస్మరణే నా జీవనవేదం.సర్వ మునిగణాలూ నిన్ను స్తుతిస్తాయి.అలాంటి నిన్ను భక్తి శ్రద్థలతో సేవించడమే నా ధ్యేయము.
ఎలాంటి భేషజాలకూ పోకుండా అర్జునుడికి రథ సారధ్యం చేసావు.అతను మనసా వాచా కర్మణా నిన్నే నమ్ముకున్నాడు కదా!గుర్రాలను రణరంగంలో పరుగులెత్తించావు.సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా కనిపిస్తాడు.అట్లనే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు కూడా ఎవరికి తగినట్లుగా వారికి కనిపిస్తుంటాడు.
భీష్ముడు ఇలా భగవంతుడు అయిన శ్రీకృష్ణుడిని మనసు నిండా నింపుకుని,ఉఛ్వాసనిశ్వాలను ఆపి పరమపదం పొందాడు.
ధర్మరాజు చింతించాడు.తరువాత భీష్మపితామహుడికి పరలోక క్రియలు జరిపించాడు.సోదరులు,శ్రీకృష్ణుడుతో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు.
ధృతరాష్ట్రుడు,గాంథారీల అంగీకారము తీసుకుని ధర్మమార్గములో రాజ్యపాలన చేసాడు.ధర్మరాజు బంధువులను యుద్ధంలో పోగొట్టుకున్న దుఃఖంలో తనకూ ఏ సుఖాలూ,రాజ్యాలూ వద్దన్నాడు.కానీ శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యం గుర్తుచేసి,రాజ్యము అరాచకం కాకుండా ఉండాలంటే సుపరిపాలన ఉండాలి అని అర్థం అయ్యేలా చేసాడు.ధర్మరాజును రాజ్యపాలకుడిగా నియమించాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment