Wednesday, 2 September 2026
దేవ వర్గము సృష్టి
దేవ వర్గము ఎనిమిది రకాలుగా విభజన కాబడ్డది.అందులో విబుధులు,పితృ దేవతలు మరియు సురాదులు అని మూడు భేదములు;గంధర్వులు,అప్సరసలు ఒక తెగ;యక్షులు,రక్షసులు ఒక తెగ;భూత ప్రేత పిశాచములు ఒక విధము;సిద్ధులు,విద్యాధరులు,చారణలు ఒక తెగ;కిన్నర కింపురుషులు ఒక తెగ;ఇట్లా ఎనిమిది రకములుగా విభజన కావించబడినది.ఈ దేవ వర్గమును కూడా కలుపుకంటే మొత్తము సృష్టి పది రకములు.
కల్పాంతమున అమోఘ సంకల్పుడు అయిన శ్రీహరి రజో గుణముతో కూడి,తానే సృష్టి కర్త అగుచూ స్వస్వరూపమున విశ్వమును కల్పించాడు.అంతా ఆయన మాయే!ఇంకేమీ వేరే లేదు.దాని ప్రభావము వలన పూర్వాపర భావములు తెలియ కుండా గందర గోళం అనిపిస్తుంది.నిజానికి చెప్పాలంటే సుడి గుండం లో పడిన చెట్లు ఎట్లా తిరుగుతుంటాయో,అలా ఉంటుంది పరిస్థితి.ఈ కల్పములో ఉండే దేవతలు,అసురులు ప్రతి మన్వంతరములోనూ నామ రూపాలు కలిగి ఉంటారు.దేవ సృష్టి లోనే కౌమార సృష్టి అని ఇంకొకటి ఉంది.అది ప్రాకృత,వైకృత ఉభయాత్మకము అయి ఉంటుంది.అదే సనత్కుమారాది సృష్టి.వీరిలో దేవత్వమూ,మానుషత్వమూ రెండూ కలగలిపి ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment