Tuesday, 3 November 2026

బ్రహ్మ సృష్టి ఇంకా…brahmas creation continues

బ్రహ్మ హృదయాకాశము నుంచి ప్రణవము పుట్టింది.ఓంకారమునే ప్రణవము అని అంటారు.రోమములు నుంచి ఉష్ట్క్ ఛందస్సు,త్వక్కు వలన గాయత్రీ ఛందస్సు,మాంసము వలన త్రిష్టుప్ ఛందస్సు,స్నాయువు వలన అనుష్టుప్పు,అస్థి వలన జగతీ ఛందము,మజ్జ వలన పంక్తి ఛందము,ప్రాణము వలన బృహతీ ఛందము,కకారాది పంచ వర్గలు గల స్పర్శము లనే జీవుడు,అకారాది స్వరాత్మకమగు దేహము,శష సహ అను నాలుగు ఊష్మల రూపములగు ఇంద్రియములు,అంతస్థములగు యరలవలు,షడ్జాది సప్త స్వర రూపమగు శబ్దబ్రహ్మములు ఉత్పన్నమయ్యాయి.వ్యక్తావ్యక్తమై వైఖరీ ప్రణవాత్మక శబ్దబ్రహ్మము వలన పరమాత్మ అవ్యక్తాత్మకుడగుట వలన పరిపూర్ణుడూ,వ్యక్తాత్మకుడు కాబట్టి ఇంద్రాది శక్తుపబృంహితుడుగా కనపడతాడు.ఆ తరువాత బ్రహ్మ ఋషి గణముల వలన సంతతి వృద్ధి కాదని తెలుసుకుంటాడు.తన తనువును చాలించి,మరల శరీరము పొంది ప్రజాసృష్టి చేసేదానికి ఉద్యుక్తుడు అవుతాడు.అట్లా చేసినా ప్రజాభివృద్ధి కాలేదు.దీనికంతటికీ కారణం దైవానుగ్రహము లేకపోవుటే అని తీర్మానించుకున్నాడు.ఇంక అతను ఇద్దరు అయ్యాడు.అంటే స్వాయంభువ మనువు,శతరూప అనే దంపతులుగా అయ్యాడు.వారికి ప్రియవ్రతుడు,ఉత్తానపాదుడు అని ఇద్దరు పుత్రులు కలిగారు.అలానే ఆకూతి,దేవహూతి,ప్రసూతి అని ముగ్గురు కుమార్తెలు జన్మించారు.అకూతి రుచికుని,దేవహూతి కర్దముని,ప్రసూతి దక్షుని వివాహం చేసుకుని ప్రజాసంతతిని వృద్ధి చేసారు. ॥॥॥॥॥॥॥॥॥॥ From Brahmas mind Omkaaram was born.From his hair,skin,flesh,bones and different parts of the body Chandassu,sensory organs,letters and many more were created.He realised that sages can not procreate and enhance progeny.But he failed to create on his own.So,he became two persons,Swaayambhuvu Manuvu and Satharoopa.They married and became parents for Priyavrathudu,Uththaanapaadudu,Aakoothi,Devahoothi and Prasoothi.Aakoothi married Ruchikudu,Devahoothi married Kardamuni and Prasoothi married Dakshudu.They succesfully participated in procreation and enhanced their progeny.

No comments:

Post a Comment