Friday, 16 October 2026

గృహస్థ వృత్తులు….. Occupations of householder

నాలుగు రకాల గృహస్థ వృత్తులు ఉన్నాయి.అవి నిషిద్ధము కాని వార్త,యాగాది కర్మలకు ఉపయోగించే ధనమును యాచించుట,యాచింపకయే లభించు,శాలీనము,శిలోంఛములు.శాలీనము అంటే ఎవరినీ ఏదీ యాచించకుండా దక్కిన,ఉన్నదానితో తృప్తి పడడము.శిలోంఛము అంటే పంట నూర్పిడులు జరిగేటప్పుడు కొన్ని కంకులు ప్రక్కన పడిపోతాయి.వాటిని తీసుకుని భుక్తి గడుపుకుంటారు.ఏదీ పండించరు,ఎవరినీ యాచించరు,ఏదీ దాచిపెట్టుకోరు.అలా ఎవరికీ అవసరములేని వాటితో తమ కడుపు నింపుకుంటారు.ఈ పద్ధతి ఎక్కువగా సాథువులు పాటిస్తారు.భూమి దున్నకుండానే పండిన పంటను తినేవారిని వైఖానసులు అని అంటారు.క్రొత్త ఫలము లభించిన తరువాత పాతదానిని విడిచి పెట్టేవారిని వాలఖిల్యులు అని అంటారు.ఉదయము లేవగానే ఏ దిక్కు చూస్తారో,ఆ దిక్కుకే పోయి అక్కడ దొరికినవి తింటారో,వారిని ఔదుంబరులు అని అంటారు.చెట్లనుంచి పండి,రాలిన పండ్లను భుజించే వారిని ఫేనవులు అని అంటారు.ఈ నాలుగు రకాల వాళ్ళు వానప్రస్థము అనుసరించేవారు.తమ ఆశ్రమానికి విధింపబడిన పనులు మటుకే చేసేవాడు కుటీచకుడు అని అంటారు.కర్మము ముఖ్యము కాదు,జ్ఞాన సముపార్జనే ముఖ్యము అనుకునేవాడు బహూదుడు.జ్ఞానము పూర్వాపరాలు తెలుసుకోవడమే కాకుండా తన నిత్య జీవితమునకు అన్వయించుకుని,నిష్టతో బ్రతికేవాడు హంసుడు.పరబ్రహ్మతత్త్వములో మునిగి తేలేవాడు నిష్క్రియుడు.వీరు నాలుగు రకాల సన్న్యాసులు.విద్యలు నాలుగు రకాలు.అవి ఇలాగున్నాయి.ఆత్మానాత్మ వివేక విద్యను అన్వీక్షకి అని అంటారు.స్వర్గాది ఫలములను ఇచ్చే విద్య త్రయి.జీవించేదానికి పనికి వచ్చే విద్య మేర్త.ధనము ఆర్జిండములో మెళకువలు చెబుతుంది దండనీతి.ఈ నాలుగూ మోక్ష ధర్మ కామార్థములను ఇచ్చే నాలుగు విద్యలు.భూమి,అంతరిక్షము,స్వర్గము అనేవి వ్యాహృతులు.ఈ పైన ఉదహరించినవి అన్నీ బ్రహ్మ నాలుగు ముఖాల నుండి ఆవిర్భవించాయి. Acceptable news,imploring or requesting money to be used for religious rituals,(saaleenamu)money acquired without being asked and(silonchamu) gleaning left over corns from harvested field and securing grains are the four professions of common married man.Vaikhanasulu eat the food which they do not grow.Vaalikhiluyulu leave away the earlier harvest products once new crop comes for harvest.Audumbarulu go in that direction in search of food,which they see at first when they wake up.Phenavulu eat fruits that fall from the trees after ripening.All these four types of people are called Vaanaprasdhulu.Vaanaprasdhulu generally lead a retired life. Like this,there are four types of sages.Kuteechakudu primarily does things entrusted to him in running the Aasramam or sages abode.Bahoodudu does not give importance to the manual or physical acts but is more interested in gaining knowledge.Hamsudu is the one who has gained knowledge and is still enthusiastic to learn more and more and relate it to his life.Nishkriyudu is the one who has achieved full knowledge and achieved Parabrahmathaththvam.Study regarding self and non self is called Aanveekshaki.Thrayi is the study of acquiring fruits of Heaven.Study of daily livelyhood is called Mertha.Dandaneethi is the study of acquiring wealth.Education of Moksha,Dharma,Kaama and Ardha are the four main pillars of Study.Sacred utterances of Bhoorbhuvassuvah are created.All the above mentioned things have been created from the four faces of Brahma.

No comments:

Post a Comment