Monday, 5 October 2026

బ్రహ్మ పుత్రులు…sons of Brahma

బ్రహ్మకు అర్థం అయిపోయింది.వేరే వాళ్ళతో పెట్టుకుంటే లాభం లేదని.తనే రంగంలోకి దిగాడు.తనే స్వయంగా సృష్టికి శ్రీకారం చుట్టాడు.తనతో సమానమయిన పదిమంది కలిగారు.బ్రహ్మ దేవుని బొటన వ్రేలు నుండి దక్షుడు,తొడవలన నారదుడు,నాభి నుండి పులహుడు,చెవినుండి పులస్త్యుడు,దేహము నుండి భృగువు,చేతి నుండి క్రతువు,ముఖము నుండి అంగిరసుడు,ప్రాణము నుండి వసిష్టుడు,మనసు నుండి మరీచి,కన్నుల నుండి అత్రి పుట్టారు.వీరే కాకుండా అతని దక్షిణ స్తనము నించి ధర్మము,వెన్నుపూస వలన అధర్మము,మృత్యువు,ఆత్మ నుండి మన్మథుడు పుట్టారు.అతని కనబొమల నుండి క్రోధము,అధరము నుండి లోభము,ముఖము నుండి సరస్వతి,మేఢ్రము నుండి సముద్రములు,అపానము నుండి నిరృతి,ఛాయ వలన దేవహూతి కర్దములు పుట్టారు. ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥ Brahma was disillusioned with the outcome after Rudraganamu created havoc.He himself decided to start progeny.He had ten children who were equal to Him in all aspects.Dakshudu was born from his thumb,Naaradudu from his thigh,Pulahudu from umbilicus,Pulasthyudu from ear,Bhruguvu from his body,Krathuvu from his hand,Angirasudu from his face,Vasishtudu from his life,Mareechi from his soul and Athri from his eyes were born.Besides these,He had Dharmamu (justice)frim his breast,Adharmamu and Mruthyuvu(injustice and immorality and death)from his backbone,Manmadhudu from His soul,krodhamu(anger,fury and wrath)from his eye brows,Lobhamu(greed)from his lips,Saraswathi from his face,oceans from medramu(penis),Nirruthi from Apaanamu(anus) and Devahoothi and Kardamulu from chaaya(shadow).

No comments:

Post a Comment