Wednesday, 7 October 2026

బ్రహ్మ చేసిన తప్పు…brahmas wrong act

బ్రహ్మ ముఖము నుండి సరస్వతి పుట్టింది కదా!అంటే పుత్రికతో సమానము కదా!కానీ బ్రహ్మకు ఆమె పైన మోహము కలిగింది.అది తన కుమారులు అయిన మరీచి మున్నగువారు చూసారు.అతనిని తీవ్రంగా నిందించారు.బ్రహ్మకు తల కొట్టేసినంత పని అయింది అవమానమూ,చిన్నతనముతో.బ్రహ్మ దేహత్యాగము చేసాడు.దిక్కులూ,మూలలూ కలిపి ఎనిమిది కదా.అవి ఆ దేహాన్ని తీసుకుని పోయాయి.దాని వలన మంచు,చీకటి ఏర్పడింది. బ్రహ్మ తన శరీరము నశించిపోయినా,ఇంకో దేహమును ధరించాడు.అధైర్య పడకుండా సృష్టి కార్యము చేయ బూనాడు.కానీ చేతకాలేదు.ఎట్లా?ఎట్లా?ఎట్లా?అని మల్లగుల్లాలు పడ్డాడు.ఈ ఆలోచనల వలన అతని నాలుగు ముఖముల నుండి నాలుగు వేదములు,యజ్ఞములు,గొప్ప కర్మములు,తంత్రములు,ప్రవర్తనలు,ఆశ్రముములు పుట్టాయి. ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥Saraswathi was created from the face of Brahma.So,literally she is like a daughter to him.But Brahma was bewitched by her beauty and lusted for her.His sons like Mareechi and others saw it and admonished him very stongly.Brahma was ashamed of his heinous act and could not look into their faces.He left his body.All the eight directions(east,west etc)took his body away.Because of that darkness and ice filled the entire space.Again Brahma created and entered into another body.He wanted to start procreation but utterly failed.He could not find any way.He was thinking,thinking and thinking but to no avail.Because of this four Vedas(sacred scriptures)came from his four faces.Besides Vedas,Yajnamulu(sacred rituals),great acts or deeds,Thanthramulu(procedures adopted to achieve spiritual awakening),behaviours and Aasramamulu(religious centres)were created.

No comments:

Post a Comment