Saturday, 10 October 2026

వేదములు,ఉప వేదములు…Vedamulu,Upavedamulu

బ్రహ్మకు నాలుగు ముఖములు ఉన్నాయి కదా!ఆ నాలుగు ముఖముల నుండి ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదము మరియు అధర్వణ వేదములు పుట్టాయి.ఇంతే కాకుండా హోతృ కర్మలైన అప్రగీత మంత్ర స్తోత్రములగు శస్త్రములు,అధ్వర్యు కర్మయగు ఇజ్యము,సంప్రగీతి స్తోత్రమగు స్తుతియు,ఉద్గాతృ ప్రయోజ్యమగు ఋక్సముదాయ రూపస్తోమము,ప్రాయశ్చిత్తమగు బ్రహ్మకర్మయు,ఆయుర్వేద,ధనుర్వేద,గాంధర్వ వేదము అనే ఉపవేదములు పుట్టాయి.ఇంకా విశ్వకర్మ శాస్త్రమగు స్థాపత్యము,ప్రాజ్ఞ్ముుఖము మున్నగు శాస్త్రములు ఆ నాలుగు ముఖములనుండి వెలువడ్డాయి.మనము పంచమ వేదము అనే ఇతిహాస పురాణాలు కూడా ఆ నాలుగు ముఖముల నుంచి పుట్టాయి.కర్మ తంత్రము అయిన షోడశి,ఉక్థ్యములు,జయనాగ్నిష్టోమములు,అస్తోర్యామాతిరాత్రములు,వాజపేయ గోసవములు,ధర్మదేవత పాదములు అయిన విద్య,దాన,తపసు,సత్యములు,బ్రహ్మచర్య,గృహస్థ,వానప్రస్థ యత్యాశ్రమములు,చతుర్విధ వృత్తులు కలిగినవి.బ్రహ్మచర్యము సావిత్రము అంటారు.అది ఉపనయనము మొదలు మూడు దినములు గాయత్రి జపించుట అను ప్రాజాపత్యమును,వేదవ్రత చతుష్టయము.అందు ప్రతి వ్రతమును వ్రతులు సంవత్సర కాలము చేయవలెను.బ్రహ్మమును వేదగ్రహణానంతరము చేయవలెను.బృహత్తును,నైష్టికంబును అను బ్రహ్మచారి వృత్తి చతుష్టయము. /////////////// We all know that Brahma has four heads.From his four faces Rigveda,Yajurveda,Saama veda and Adharvanavedas were born.Besides these,Hothru karmas (ancestral rites done to appease the deceased)manthras,Adharyu karmas Ijya(worthy of worship),Samprageetha Sthuthi(prayer or hymn),Udgaathru (priest)Ruksamudaaya roopasthomamu,Brahma karma(act of offering to the supreme),Aayurveda(science about life and longevity),Dhanurveda(science of archery),Gaandharva (science of music and fine arts)vedas also called as upa vedas(applied knowledge)were created.From his four faces Ithihaasa puraanaas,also called as Panchama vedas were born.In addition,Karma thanthra called Shodasi,Ukdhyamulu(offering with hymns),Jayanaagnishtomamulu(vedic fire sacrifices to achieve victory)Apthoryaamaathiraathramulu(yajnas conducted for welfare of the humanity and animal kingdom),Vaajapeya gosavamulu(yajna conducted to attain sovereignity),four legs of Dharma devatha ...education,donation,meditation and truth were born.Brahmacharya(celibacy),Gruhastha(family life),Vaanaprasdha(leading simple and austere life in woods in old age),Yathi asramam (leading pious and religious devoted life in the woods)and all four types of work chathurvidha vruththulu were created.Upanayanam(sacred thread ceremony)is called Savithramu.Starting with Upanayanamu(thread ceremony) Gayathri manthra should be chanted for three days.It is called as Praajaapathyamu (procreative celibacy)and vedavratha (determined to follow celibacy till learning is complete)chathushtayamu.This means it has four steps.they are Savithramu,Brahmamu,Bruhaththu(life long spiritual dedication and celibacy),and Naishtikam(life long celibacy and perpetual learner).Brahmamu should be done after vedagrahanaanantharam.All the four vrathas should be dne continuously for a year.

No comments:

Post a Comment