Saturday, 3 October 2026
రుద్రుడు…Rudrudu
బ్రహ్మ క్రోధము వలన రుద్రుడు పుట్టాడు కదా!బ్రహ్మ అతనికి చెప్పాడు.కుమారా!నీవు రోదనము(ఏడుపు)చేస్తూ పుట్టావు కదా!అందుకని నీకు రుద్రుడు అనే పేరు ప్రసిద్ధమవుతుంది.చంద్రుడు,సూర్యుడు,అగ్ని,వాయువు,జలము,ఆకాశము,పృథివి,ప్రాణము,తపస్సు,హృదయము,ఇంద్రియములు...।ఈ పదకొండూ నీకు స్థానములు.మన్యువు,మనువు,మహాకాలుడు,మహాచ్ఛివుడు,ఋతద్వజుడు,ఉరురేతుడు,భవుడు,కాలుడు,వాసుదేవుడు,థృతవ్రతుడు...ఈ పదకొండూ నీ నామములు.ధీవృత్తి,ఉశన,ఉమ,నియతి,సర్పిస్సు,అర్చి,ఇల,అంబిక,ఇలావతి,సుధ,దీక్ష...వీరు భార్యలు.మీరు మీ మీ భార్యలతో నేను చెప్పిన ఆవాసములలో నివసించి,ప్రజలను పుట్టించాలి.
బ్రహ్మ చెప్పిన మాట విని,ఏకాదశ రూపములు దాల్చి రుద్రుడు రుద్రగణమును సృజించాడు.ఆ రుద్రగణము విశ్వాన్ని మ్రింగి లోకోపద్రవము కు నడుము బిగించింది.ఇదంతా చూస్తుంటే బ్రహ్మకు తల తిరుగుతుంది.చాలా బాథ పడ్డాడు.తన కుమారులు అయిన రుద్రులను అందరినీ పిలిపించాడు.కుమారులారా!నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది.మంచి జరగాలని అనుకుంటే ఉపద్రవము వచ్చి మీదపడుతున్నది.మీరు ఇంక భగవద్ ధ్యానం చేసుకోండి శ్రీహరిని అని హితోపదేశం చేసాడు.మీకు అంతా మేలు కలుగుతుంది.
Rudrudu...,Brahma started talking to Rudra.Hey son!you were born crying.So,you will be identified as Rudra and become famous.Chandrudu(moon),Sooryudu(Sun),Agni(fire),Vaayuvu(air),Jalamu(water),Aakaasamu(sky),Prudhivi(Earth),Praanamu(life),Thapassu(penance),Hrudayamu(heart),Indriyamu(sensory organs)...all these are your residing places.Manyuvu,Manuvu,Mahaakaaludu,Mahaachchivudu,Ruthadhvajudu,Ururethudu,Bhavudu,Kaaludu,Vaasudevudu,Dhruthavrathudu...You will have these names.Dheevruthi,Usana,Uma,Niyathi,Sarpissu,Archi,Ila,Ambika,Ilaavathi,Sudha,Deeksha...all these would be your wives in all the residing places you live in your eleven forms.You live with them and start progeny.
Rudra accepted Brahmas directions and succeeded in creating Rudraganamu.Rudraganamu brought chaos all over the universe.It started nullifying everything which came across them.Brahma was dejected and disillusioned.He wanted to do something good and prospering.He never did expect this type of outcome and utter chaos.He called his sons and told them.Hey sons!enough of all this.More damage is being done than anything good and proper.You devote your remaining life in praying Sri Hari.You will surely be benifitted.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment