Wednesday, 30 September 2026
పాపసృష్టి….Paapasrushti
బ్రహ్మ దేవుడు మొదట అహంకార బుద్ధిగల మోహమును పుట్టించాడు.తరువాత సంసార సుఖేచ్ఛలు గల మహామోహమును పుట్టించాడు.వెనువెంటనే అంధతామిస్రము,తామిస్రము,చిత్తభ్రమమును పుట్టించాడు.తామిస్రము అంటే చీకటి లాంటి అజ్ఞానము,క్రోధము,కోపము లాంటివి.అంథతామిస్రము అంటే తామిస్రము కంటే భయానకము మరియు మరణ భీతి.చిత్తభ్రమము అంటే గందరగోళము,భ్రమ.ఇదంతా పాపసృష్టి.ఇలా చేసినందుకు అతనికి తనపైనే అసహ్యము కలిగింది.పశ్చాతాపము మొదలు అయింది.ఇట్లా కాదు అని పరితపించాడు.భగవంతుని ధ్యానించాడు.అతని అనుగ్రహముతో పవిత్ర మనస్కుడు అయినాడు.ఇప్పుడు సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు.అస్ఖలిత బ్రహ్మచారులు,పరమ పవిత్రులు అయిన సనక,సనందన,సనత్కుమార మరియు సనత్సుజాతులు అనే నలుగురు మునులను సృష్టించాడు.అతడు వారితో ఇలా అన్నాడు.మీరు మీ మీ యంశములచే ప్రజలను పుట్టించాలి అని కోరాడు.వాళ్ళు దానికి ససేమిరా వీలు కాదు అన్నారు.బ్రహ్మకు భలే కోపము వచ్చింది.ఆ క్రోధము నుండి శివుడు పుట్టాడు.దేవతలలో అతనే ముఖ్యుడు.
Brahma created Mohamu ie desire,Mahaamohamu ie lust,Andhathaamisranu,Thaamisramu and chiththa bhrama.Thaamisramu means darkness or ignorance resulting in anger and cruelty.Andhathaamisramu means severe state of Thaamisramu resulting in fear of death and utter blind darkness.Chiththabhramamu means illusion and confusion.These are all creation of negativity.He was feeling guilty for having done this.He repented his move.He went into Dhyaana or meditation.By the grace of God,he was purified.He,again,started creation.This time,he created pure souls,great sages...Sanaka,Sanandana,Sanath kumaara and Sanathsujaathulu.He requested them to enlarge,expand mankind.But they bluntly refused to have progeny.Brahma was very angry and annoyed.He lost his temper.Out of that temper,Siva was created.He is an important God among deities.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment