Thursday, 24 September 2026
ప్రళయము….cosmic dissolution
బ్రహ్మ యొక్క దివ్య ప్రమాణ కాలమున పదునులుగురు మనువులు ఉంటారు.ఒక్కొక్క మనువు కాలము డెబ్బై ఒక్క దివ్య యుగములు.ఆ మనువులు,దేవతలు,మునులు,సప్తర్షులు భగవదంశములో పుట్టి లోకాలను పాలిస్తారు.మహా విష్ణువే పితరులు,తిర్యక్కులు,నరులు...ఇలా చాలా రూపాలలో పుట్టి,మన్వంతరములందు లోకాలను పాలిస్తూ ఉంటాడు.
పగటి వేళ అయిపోగానే బ్రహ్మ నిద్ర పోతాడుఆ రాత్రి చిమ్మ చీకటిగా,గాఢాంధకారము అలుముకుని ఉంటుంది.సూర్య చంద్రులే కాదు,ముల్లోకాలూ కనిపించవు.మహా విష్ణువు శక్తి వలన ఏర్పడిన సంకర్షణాగ్ని సర్వమూ దహించి వేస్తుంది.ఆ జ్వాలల వేడికి మహర్లోక నివాసులు కమిలిపోయి,జనలోకానికి పోతారు.అప్పుడు ప్రళయము ఏర్పడుతుంది.మహా సముద్రము నీటితో అన్ని లోకాలనూ ముంచి వేస్తుంది.అప్పుడు మహా విష్ణువు సముద్రము మధ్యలో శేషతల్పము పైన పడుకుని,యోగనిద్రలో ఉంటాడు.అప్పుడు భూర్భువరాది లోకములు అన్నీ అతని కుక్షియందు నిక్షిప్తమయిఉంటాయి.జనలోక వాసులు అతనిని స్తుతిస్తూ ఉంటారు.
Cosmic dissolution or pralaya...
In the full term of Brahma,there will be fourteen manuvulu.Each Manuvu has a term of seventy one celestial eras.Those Manuvulu.. father of mankind,deities,sages,saptharshis are born with Almightys ansh or part and rule these worlds.Maha Vishnu,Himself,is born as Pitharulu...ancestral fore fathers,deities,Thiryakkulu...animal kingdom,and humans and rules these worlds.
As soon as day comes to an end,Brahma goes to sleep.Night is pitch dark.Sun,Moon and other planets and worlds can not be seen.Sacred and powerful Fire which eminates from Maha Vishnu destroys everything.Due to the severe heat and dust,residents of Maharlokas run away and take shelter in Janalokas.Then Destruction on massive scale occurs and waters of the oceans submerge all the worlds.Then,Maha Vishnu is seen lying on Sesha naagu,amidst the ocean,and in deep sleep.All the worlds,which he created,will be seen lying dormant in his abdomen.Who ever are present on janalokas...realms of humanity,will be chanting His name.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment