Tuesday, 29 September 2026
బ్రహ్మ ఆయువు…life span of Brahma
మనుష్యుల ఆయుష్షు నూరు ఏండ్లు కదా!అట్లానే బ్రహ్మ ఆయుష్షు కూడా నూరు ఏండ్లే.అందులో మొదటి సగము పూర్వ పరార్థము అని అంటారు.అలాగే రెండవ సగము ద్వితీయ పరార్ధము అని అంటారు.మొదటి పరార్ధమునకు బ్రహ్మ కల్పము అని పేరు వచ్చింది.ఎందుకంటే ఆ కల్పము మొదట్లో బ్రహ్మ పుట్టాడు.తరువాత దానికి శబ్ద బ్రహ్మమని పేరు కూడా పెట్టబడినది.విష్ణు దేవుని నాభి నుంచి పద్మము పుట్టింది కదా!దానిని పద్మ కల్పము అని అంటారు.ప్రస్తుతము పూర్వ పరార్ధము అయిపోయి ద్వితీయ పరార్ధము జరుగుతున్నది.ఈ పరార్ధము మొదట శ్రీ మహా విష్ణువు వరాహ రూపము దాల్చాడు.కాబట్టి దీనికి వరాహ కల్పము అనే పేరు సార్ధకమయినది.నిజం చెప్పేదా?పరమాణువు మొదలుకుని పరార్ధాంతము వరకు గల కాలము విష్ణువు కు ఒక నిమేషకాలము.అతడు కాలమునకు కర్త.అంతేకానీ కాలము అతనికి కర్త కాదు,కాజాలదు.
ఇప్పుడు బ్రహ్మాండకోసము గురించి చెబుతాను.ఇది పదహారు వికారములతో కూడి ఉంటుంది.పృథివి మున్నగు పంచభూతములతో పరివృతము అయి ఉంటుంది.పది ఆవరణలు కలిగి ఉంటుంది.పంచాశత్కోటి విస్తీర్ణము కలిగి ఉంటుంది.దీని మధ్యలో శ్రీహరి పరమాణు రూపములో ఉంటాడు.లెక్కలేనన్ని మహాండకోశములు అతని కుక్షి యందు నిక్షిప్తమయి ఉంటాయి.అప్రమేయుడు ,నిరతిశయుడు,ధగద్ధగమానమయిన ప్రకాశముతో విరాజిల్లుతుంటాడు.అతనిని వర్ణించడం బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదు.
Life span of humans is hundred years.Brahmas life span is also one hundred years.The first half of it is called Poorva paraardhamu.Second half is called Dvitheeya Paraardhamu.First half is also called as Brahma Kalpamu.Because Brahma was born at the start of that Kalpa,it is called as Brahma Kalpamu.Later it was called as Sabda brahmamu.Lotus rose from umbilicus of Vishnu.So,it is called as Padma Kalpamu.Poorva Paraardhamu is over.Now,Dvitheeya Paraardhamu is running.Because of the reason that Vishnu took up Varaaha Avathaaram at the start of this Kalpa,this is named as Varaaha Kalpamu.Starting from an atom to the end of Paraardhamu...this time is just a minute to Vishnu.He created Time.Time has no say in directing Him.
Brahmaandakosamu consists of sixteen vikaaramulu or nuances.It is made of Pancha bhoothamulu or Elements.It has ten layers.It has huge surface area of five billion miles.In the midst of this,Vishnu is in atom form.But he has so many Mahaandakosamulu or entire planetary systems in his abdomen.He is shining like one crore Suns shining simultaneously.Even Brahma and other deities fail to praise Him properly and perfectly.Vishnu is the Supreme and Infinite.No one can match Him.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment