Thursday, 26 November 2026

స్వాయంభువ మనువు…Swaayambhuva manuvu

ఇంత సేపూ మైత్రేయ మహర్షి బ్రహ్మ సృష్టి చేసేదానికి ఎంత తాపత్ర పడ్డాడో వివరంగా చెప్పాడు.విదురుడు ఆ మహనీయుడు చెప్పినదంతా ఆకళింపు చేసుకున్నాడు.ఈయనకు జ్ఞాన తృష్ణ ఇంకా తీరలేదు.అందుకని అడుగుతున్నాడు.ఓ మహాత్మా!స్వయంభువుని పుత్రుడు స్వాయంభువ మనువు అని చెప్పారు.అతను మనువు రాజులలో ఉత్తముడు అని ప్రసిద్థి.అతని గురించి కూడా వినాలని నాకు కుతూహలం గా ఉంది. మైత్రేయ మహర్షి విదురుడు కోరికను,ప్రార్థనను కాదనలేక పోయాడు.ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు. స్వాయంభువు మనువు తన భార్యతో కలసి బ్రహ్మ కు నమస్కరించి,ఇలా వివరించుకున్నాడు.ఓ తండ్రీ!సమస్థ జీవ రాసుల సృష్టి కి ,స్థితికి,లయమునకు నువ్వే కారణ భూతము.నీ పుత్రుడుగా జన్మించడం నా అదృష్టము.తండ్రి కోరికలను తీర్చడమే పుత్రునిగా నా విథి,ధర్మము.నేనేమి చేయాలో నిర్దేశించండి. బ్రహ్మకు మహదానందం అయింది కొడుకు మాటలు విని.కానీ అసలు నిజము పుత్రునకు వివరించాడు.నాయనా!నీవనుకున్నది నిజము కాదు.సర్వమునకు కారణము శ్రీహరియే!అతను సంతోషము,తృప్తి పడేలాగ యాగములు చేయి.నీకు సమస్త శుభములు కలుగుతాయి.నీ పుత్రులతో కూడా కలసి భూభారమును వహించు.ప్రజలను మంచిగా పాలించు.మంచి వాళ్ళను రక్షించు. స్వాయంభువ మనువు ఇలా సమాధానం ఇచ్చాడు.ఓ తండ్రీ!నీ ఆజ్ఞను శిరసావహిస్తాను.కానీ నిజానికి నాకు,నా బిడ్డలకూ నివసించేదానికి తావు లేదు.భూమండలము అంతా నీటితో నిండి ఉంది.ముందర దానిని ఉద్ధరించాలి.దానికి ఉపాయమేమైనా ఉంటే తెలిపేది. బ్రహ్మకు అప్పుడు బుర్రకు ఎక్కింది.నిజమే కదా!ముందర సృష్టి జలము కదా!ఆ తరువాతే కదా పృథివి ఏర్పడింది!కాబట్టి భూమి మొత్తమూ నీటిలో మునిగి ఉండడం సహజమే కదా!ఇప్పుడు దారి ఏది?ఎలా భూమిని ఉద్ధరించాలి?అని ఆలోచన మొదలు పెట్టాడు.అప్పుడు అతని నాసికా రంధ్రము నుండి యజ్ఞ వరాహ మూర్తి ఆవిర్భవించాడు. ॥॥॥॥॥॥॥॥ Till now Maithreya maharshi was telling Vidura aboit how Brahma tackled the problem of creation of man.Vidura understood each and everything about what all the sage said.He was still more inquisitive to learn more about all other things too.So,he pleaded the sage to enlighten him about Swaayambhuvu Manuvu and how he continued his efforts regarding increasing progeny. Maithreya maharshi obliged and continued telling him what happened next. Swaayambhuvu manuvu,along with his wife,saluted his father and asked him.Hey Father!you are the Creator of this entire srushti or creation,protector and destroyer too.I am lucky to be born as your son.I am bound to fulfill your wishes.You name them. Brahma was happy to hear those words from his son.But he clarified that actual Creator was Srihari.You do Yagas or rituals to please Him.He will bless you and everything will be good for you.You rule this Earth along with your children nicely.Always protect the right and protest what is wrong or bad. Swaayambhuvu manuvu replied his father.Hey father!I abide by your instructions.But there is a flaw.This entire Earth is filled with water.Where can I stay with my children?Please help me to clear this to make it my abode. Brahma then realised that what his son was saying was really true.First they created water,then they created land.So,automatically it is submerged.There should be a way to clear it.He was thinking and thinking.At that time,Yajna varaaha moorthy came out from his nostrils.

No comments:

Post a Comment