Thursday, 23 April 2026
శ్రీకృష్ణుడు మైత్రేయుడికి జ్ఞాన ప్రబోధము
శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు అని చెబుతున్నాడు.విదురుడి ప్రశ్నలకు మైత్రేయుడు సమాథానం చెప్పడం మొదలు పెట్టాడు.విదురా!నీవు భగవత్ భక్తుడివి.నీవు నన్ను ఈ ప్రశ్నలు అడగడం సముచితంగా ఉంది.నాకు సంతోషంగా కూడా ఉంది.శ్రీకృష్ణుడి నిర్యాణం సమయంలో నేను అతని దగ్గరే ఉన్నాను అని చెప్పాను కదా!అప్పుడు ఆ మహానుభావుడు నన్ను దగ్గరకు పిలిచి జ్ఞానము అంతటినీ ఉపదేశించాడు.ఆయన నాకు చెప్పినదంతా తు చ తప్పకుండా నీకు వివరిస్తాను.భక్తి శ్రద్ధలతో వినుము.
భగవంతుడు సృష్టికి పూర్వము తన మాయా ప్రభావం చేత సమస్తమునూ లయమొందించాడు.అతను ఒక్కడే దివ్యమయిన తేజస్సుతో వెలుగ సాగెను.ఆ తరువాత కాలంలో తాను పురుషాకృతిలో ఉండి,ఆత్మాంశమున స్ఫురించిన శక్తిని నిలిపి,తన యుదరమునందణగియున్న విశ్వమును పుట్టించెను.మాయ వలన మహాతత్త్వమునందు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణకమయిన అహంకార తత్త్వము ఉత్పన్నమయింది.సాత్త్వికాహంకారము వలన మనస్సు,దేవతా గణము పుట్టినవి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment