Thursday, 9 October 2025
నారదుడి తల్లి మృతి
నారదుడిని వ్యాసుడు ఇంకా ఇంకా తన జన్మ వృత్తాంతము,విశేషాలు తెలుపమని ఇలా అడిగాడు.ఓ నారద మహర్షీ!నీకు ఆ మహనీయులు నారాయణ మంత్రము ఉపదేశించారు అని అన్నావు.దాని సహాయంతో విజ్ఞాన సముపార్జన చేసాను అన్నావు.బాగానే ఉంది.అసలు నీవు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు ఏమేమి చేసావు.నీవు దాసీ పుతృడవు కదా!ఆ దాస్యము ఎట్లా పోయింది?పూర్వజ్ఞానము అనేది అందరికీ అంత సులువుగా దక్కదు కదా!నీకెట్లా అబ్బింది?ఈ విషయాలు అన్నీ వివరంగా విశద పరిచేది.
నారదుడు వ్యాసుడి తపనను అర్థం చేసుకున్నాడు.ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.వ్యాసా!నీకు చెప్పినట్లుగా నాకు యోగుల దయ వల్ల జ్ఞానము లభించింది.మా అమ్మకూడా మంచి జ్ఞానము గల శాంత మూర్తి.ఆమె తన యజమానుల ఇంటి పనులను శ్రద్ధగా చేస్తూ ఉండేది.భక్తి భావంతో ఒక యజ్ఞంలాగా నిష్టగా,నియమ బద్థంగా చేసేది.ఇంక ఆ పనిలో పడితే రాత్రి లేదు,పగలు లేదు.అయ్యో అలసిపోయాను,కొంచెం సేద దీరుతామనే స్పృహ ఉండేది కాదు.విసుగు,చీదర,చిరాకు అనేవి ఆమెకు అస్సలు తెలియదు.అలాగే ఒకరోజు రాత్రిపూట చీకటిలో పాలు పితికేదానికి పోయి,పామును తొక్కింది.పాముకు తన,మన అని ఉండగు కదా!అది దాని సహజగుణంతో కాటేసింది.పాము కాటుకు ఆమె మరణించింది.నాకు దిగులు,విచారము అనిపించలేదు.ఒకరకమైన నిర్వికారము,నిర్విచారములకు లోనైనాను.మాఅమ్మ ఆఇంట్లో పని చేసేది కాబట్టి అక్కడ ఇన్ని రోజులు ఉన్నాను.ఆమే లేనప్పుడు ఆ ఇంటితో నాకు ఇంక ఏ సంబంధం లేదు కదా!అందుకని ఆ ఇల్లు విడిచి ఉత్రదిక్కుగా నడచి వెళ్ళిపోయాను.ఎన్నో ఊళ్ళూ,ఇంకెన్నో పట్టణాలూ,గ్రామాలూ,ప్రాంతాలూ దాటుకుంటూ వెళ్ళాను.ఆకలి,దాహం పీడిస్తున్నాయి.దారిలో మంచి నీటితో ఉన్న నది కనిపించింది.అక్కడే స్నానము చేసి,దాహము తీర్చుకున్నాను.నా అలుపు,అలసట,ఆకలిదప్పులూ అన్నీ మాయమైపోయాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment