Friday, 12 September 2025
కథ మొదలు పెడదామా ఇంక
లోకములోని అన్ని అరణ్యాయలలోకీ నైమిశారణ్యము చాలా ప్రముఖమైనది.ప్రాశస్త్యము కలది.ఉత్తమమైనది కూడా!అక్కడ ఉండే అన్ని వృక్షాలు ఎప్పుడూ కళకళలాడుతుంటాయి.ఎప్పుడూ పూలతోను,రసభరిత పళ్ళతోనూ నిండి ఉంటాయి.రకరకాల హరిత వర్ణాలతో అక్కడ ఉండే చెట్లు అన్నీ శోభాయమానంగా కనువిందులు చేస్తుంటాయి.అక్కడ చాలా మంది మునులు తమ తమ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు.కాబట్టి జనులు,పురప్రజలు సంతోషంగా వారిని చూసి తరించేదానికి వస్తుంటారు.
అక్కడ ఇంకో తమాషాకూడా మనం చూడగలతాము.మామూలుగా కృూరమృగాలు సాథుజంతువులను వేటాడుతుంటాయి కదా!కానీ ఇక్కడ అన్నీ ఆలాజాలంగా,సఖ్యంగా,సామరస్యంగా కలసిమెలసి ఉంటుంటాయి.వాటి మధ్య విరోథభావాలు మచ్చుకికి కూడా కనిపించవు.ఐక్యమత్యంగా,హాయిగా,చెట్టాపట్చాలేసుకుని తిరుగుతుంటాయి.దీనికంతటికీ కారణం ఏమనుకుంటున్నారు మీరు?నేను చెప్పనా!ఇంగిత జ్ఞానము లేని జంతువులు కూడా మహామునుల ప్రభావం చేత జాతివైరం మాని,సాథ్యమైనంతగా సాధుజీవితానికి,సఖ్యతకి,సామరస్యానికీ పెద్ద పీట వేసాయి.ఇంతేనా!కాదు,కాదు.ఆ మునులు లాగా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ కానవస్తాయి.ఎంత గొప్ప కదా!
Thursday, 11 September 2025
భాగవతము చదివితే…
భాగవతము చదివి,అర్థం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి అని అంటారు.సమస్త సంపదలు దక్కుతాయి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాన సంపద దక్కుతుంది.భాగవతము మనకు ముక్తిని ప్రసాదిస్తుంది.దానిని చదివినా,వ్రాసినా,విన్నా సర్వ పాపాలు నశిస్తాయి.నిత్యమూ ధర్మమార్గంలో నడిచేవారికి శ్రీహరి సులభంగా దక్కుతాడు.ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో,ఆనందంగా విరాట్ స్వరూపుడు అయిన ఆ దేవదేవుని కొలిస్తే కష్టాలు,కలతలు ఉండనే ఉండవు.ఎందుకంటే అన్నిటినీ సమంగా స్వీకరించ గలిగే స్థితప్రజ్ఞత అలవరుతుంది.ఈ విషయం స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు.అందరికీ ధర్మం అర్థం అయి,ఆ దిశగా ప్రయాణం చేయగలిగే వెసులుబాటుకోసం వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు.
భాగవతము అనేది నిజానికి ఒక కావ్యము కాదు.వేదమనే చెట్టుకి కాసి,రసమయమయిన పండుగా మారిన జ్ఞానము.దానిని శుక మహర్షి అనే చిలుక చిరు పంటితో కొరకగా,దానినుంచి కారిన అమృత రసగుళిక ఈ మహిమాన్వితమయిన భాగవత గ్రంథము.దీని నుంచి ఎవరెవరికి ఎంతెంత కావాలో అంతంత ఆస్వాదించ వచ్చు.అది మనతృష్ణను పట్టి ఉంటుంది.ఆ రసాస్వాదనకు అంతం ఉండదు.ఎంత జుర్రుకోవాలంటే అంత జుర్రుకోవచ్చు.ఎలాంటి ఆంక్షలు,ప్రతిబంధకాలు ఉండవు.
Wednesday, 10 September 2025
శ్రీ మహా భాగవతము….।
శ్రీ మహా భాగవతము మనకు చాలా ముఖ్యమైన పురాణ గ్రంథము.వేదవ్యాసుడు ఈ గ్రంథాన్నిరచించాడు.శ్రీహరి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంటుంది.ఇది చదివినా,విన్నా చాలా మంచిది.
భాగవతము స్కంధాలుగా విభజించ బడింది.ఇందులో పన్నెండు స్కంధాలు ఉన్నాయి.
విష్ణువు భగవంతుడు.అతని గురించి తెలియ చెప్పేదే భాగవతము.విష్ణువు సమస్తలోకాలనూ పాలిస్తాడు,పరిపాలిస్తాడు.అందరినీ రక్షించేదీ అతనే!అందరినీ పుట్టించేదీ,లాలించేదీ,చివరకు గట్టెక్కించేదీ అతనే!దుష్ట శిక్షణార్థం,శిష్ట రక్షణార్థం ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో ఆవిర్భవించేదీ అతనే!సామాన్యమైన మనకే కాదు,త్రిమూర్తులకు కూడా మూల కారణం అతడు.
Subscribe to:
Posts (Atom)