ఒకసారి అక్కడ ఋషులు అందరూ కలసి మాటలాడుకున్నారు.ఏమని?వేయి ఏండ్ల కాల పరిమితి గల సత్త్రయాగము చేయాలని.మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టారు.ఆ విషయం ముల్లోకాలలోనూ తెలిసింది.ఆ యాగము చూస్తే జన్మ తరిస్తుందని రావటం మొదలుపెట్టారు.అలా వచ్చేవారిలో చాలా మంది దేవతలు,మునులు,రాజులు,పండితులు,సామాన్యప్రజానీకం ఉన్నారు.
ఒకసారి అక్కడకు సూతమహర్షి వచ్చాడు.ఆయన ఋషులందరిలోకి ఉత్తమోత్తముడు.ఎల్లప్పుడూ ఈశ్వర ధ్యానం లోనే ఉంటాడు.బహు పురాణవేత్త.అక్కడ ఉండే మునులు అందరూ ఆనందంతో ఆయనకు ఎదురేగారు.గౌరవ మర్యాదలతో తీసుకుని వచ్చారు.అర్ఘ్యపాద్యములు ఇచ్చారు.సముచిత ఆసనం మీద కూర్చోబెట్టారు.
No comments:
Post a Comment