Sunday, 21 September 2025
భగవంతుని అవతారాలు
భగవంతుని అవతారాల గురించి చెప్పుకుందాము.అన్ని అవతారాలకంటే మొదటి అవతారము నారాయణుడిదే.అతడి నాభి,అనగా బొడ్డు నుంచి వచ్చిన కమలములో బ్రహ్మ పుట్టాడు.అతడి అవయవములనుండి సకల లోకాలు ఉద్భవించాయి.అతడు కౌమారావస్థలో బ్రహ్మణ్యుడు అయి ఘోరమయిన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు.
ఇప్పుడు అతని రెండవ అవతారము గురించి చెప్పుకుందాము.భూమి క్రుంగి పోతుంటే,అది ఆపేదానికి వరాహ అవతారము ఎత్తాడు.నారదుడుగా మూడవ అవతారము ఎత్తాడు.ఈ రూపంలో కర్మల నుండి విముక్తి ప్రసాదించే వైష్ణవ తంత్రాన్ని ఉపదేశించాడు.నాలుగో అవతారములో నరనారాయణుల రూపము ధరించి ఘోరమయిన తపస్సు చేసాడు.అయిదవ అవతారములో కపిల మహర్షిగా పుట్టాడు.ఈ రూపంలో ఆసురి అనే బ్రాహ్మణుడికి తత్త్వమును నిర్ణయించే సాంఖ్యమును ఉపదేశించాడు.ఆరవ అవతారములో అత్రిమహామునికి,అనసూయాదేవికి దత్తాత్రేయుడుగా జన్మించాడు.ఈ రూపంలో అలర్కునికి,ప్రహ్లాదుడు మున్నగువారికి తత్త్వబోధ చేసాడు.ఏడవ అవతారంలో రుచికి ఆకూతి యందు యజ్ఞుడు అనే పేరుతో కుమారుడుగా పుట్టాడు.ఈ రూపంలో యముడు,ఇతర దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.అష్టమ అవతారంలో మేరుదేవి యందు నాభికి ఉరుక్రముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.ఈ జన్మలో విద్వాంసులకు పరమహంస మార్గమును బోధించాడు.ఋషులు అందరూ ప్రార్థించగా తొమ్మిదో జన్మలో పృధు చక్రవర్తిగా పుట్టాడు.ఈ జన్మలో భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిదికాడు.చాక్షుష మన్వంతరములో పదవ అవతారంగా మత్స్య రూపం ధరించాడు.ఈ రూపంలో భూరూప మయిన నావను ఎక్కించి వైవస్వతమనువును ఉద్ధరించాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment