Friday, 12 December 2025

ధారణ అంటే?

శుక యోగి పరీక్షిత్తుకు ధారణాబలము ఉంటే ఏమైనా సాథించ వచ్చు అని చెప్పాడు.అది వినగానే పరీక్షిత్తు అడిగాడు.స్వామీ!ధారణ అంటే ఏంది?దాని స్వరూప,స్వభావాలు ఎలా ఉంటాయి?అది మనం ఏమి చేస్తే లభ్యం అవుతుంది? పరీక్షిత్తు సంథించిన ప్రశ్నలకు శుక మహర్షి ఇలా జవాబు ఇచ్చాడు.రాజా!ధారణ ప్రక్రియ అంతా నీకు సావథానంగా వివరిస్తాను.ముందుగా మనలో ఉన్న వాయువును బంధించాలి.తరువాత,చంచలము,బలవత్తరములు అయిన ఇంద్రియాలను నిగ్రహించాలి.సర్వ సంగములను మనస్పూర్తిగా పరిత్యజించాలి. అటు పిమ్మట విరాట్ స్వరూపుడు అయిన శ్రీహరిని మన మనసులలో నిలబెట్టుకోవాలి.ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు,భూత,భవిష్యద్వర్తమానాలను గ్రహించి ప్రవర్తించగలవాడు.ఇలా చేయగలిగితే మనకు సమస్తము మన గుప్పిటలోకి వస్తుంది.ముందర సముద్రంలోని నీళ్ళతో ఊహించికుంటే ఒక చుక్క కంటే తక్కువ మన అస్థిత్వం.ఆ భగవంతుడు లీలామానుష విగ్రహుడు.ఈ సమస్త విశ్వం అతని చెప్పు చేతలలో నడుస్తుంది.దానిలో అనుమానం కించిత్ కూడా లేదు. సద్యో ముక్కి,క్రమ ముక్తి అని రెండు రకాలు ఉన్నాయి.సంసారము నందు ప్రవేశించిన వారికి తపము,యోగము అనే ముక్తి మార్గాలు ఉన్నాయి.కానీ ఆ రెండింటిలోనూ భక్తి మార్గము కంటే సులభమయిన మార్గము ఇంకొకటి లేదు అని ఆ భగవంతుడే నొక్కి వక్కాణించాడు. సద్యో ముక్తి అంటే మన జీవిత కాలంలోనే ముక్తిని పొందడం.ఇది జ్ఞానంతో భవబంధాలనుండి పూర్తిగా బయటపడగలిగితేనే సిద్ధిస్తుంది. కర్మ ముక్తి అంటే అంచెలంచెల మోక్షం.ఇది మరణం తరువాత లభిస్తుంది.

No comments:

Post a Comment