Monday, 8 December 2025

ద్వితీయ స్కందము…శుకుడు బోధ

సూత మహర్షి నైమిశారణ్యంలో సత్రయాగము చేస్తున్న శౌనకాది మునులతో ఇలా చెబుతున్నాడు. శుక మహాముని పరీక్షిత్తు సంకల్పాన్ని చూసి సంతోషించాడు.శుకుడు పరీక్షిత్తుని ఉద్దేశించి ఇలా అన్నాడు.ఓ రాజా!నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమయినది.ఆత్మవేత్తలు శ్లాఘిస్తారు.ఆత్మ తత్త్వము అనేది తల పండిన వారికి కూడా ఆషా మాషీ వ్యవహారము కాదు.అలాంటిది గృహస్తులు దానిపై జిజ్ఞాస పెంచుకుని అర్థం చేసుకోవడం చాలా కష్టము.ఏందుకంటే ఒక గృహస్తు మాములుగా తన పరివారం,తన పరిజనం గురించి మటుకే ఆలోచిస్తాడు.ఇంతకు మించి అనవసరం అనుకుంటాడు.ఇంకోటి,సమయం కూడా ఉండదు కాబట్టి సమయం వృథా అనుకుంటాడు.చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష లాగా సతతం నా బిడ్డలు,నా బంథువులు,నా మిత్రులు,నా భోగభాగ్యాలు....ఇలా ఎప్పుడూ నా,,,నా....నా...అనే జంఝాటం తప్ప ఇంకోదాని గురించి మనసు పోదు,ఆసక్తి ఉండదు.ఇలా తనకు తానే ఒక గూడు కట్టుకుని,బావిలో కప్ప చందాన...ఇదే నా బ్రతుకు,ఇదే నా ప్రపంచం...ఇదే నా కైవల్యం అనుకుంటాడు. ఇలాంటి వారికి సాంఖ్య యోగమే ఉత్తమము.సాంఖ్య యోగాన్ని గ్రహించగలిగితే,భగవంతుడు అయిన శ్రీకృష్ణుడిని ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండగలరు.

No comments:

Post a Comment