Monday, 22 December 2025

వరాహ,సుయజ్ఞ అవతారములు

ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతి క్రూరుడు.ఒకసారి భూమిని చాపలా చుట్టేసి,తీసుకుని పోతున్నాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు యజ్ఞ వరాహ రూపము దాల్చాడు.ఆ రాక్షసుడిని ఎదిరించాడు.సముద్ర మధ్యంలో తన వాడి కోరలతో పొడిచి చంపాడు.ఇది భగవంతుని వరాహావతారము. అకూతి స్వాయంభువు మనువు కుమార్తె.ఆమెకు ప్రజాపతికి సుయజ్ఞుడు అనే కుమారుడు కలిగాడు.సుయజ్ఞుడి భార్య దక్షిణ.వారికి సుయములు అనే పేరుగల అమరులు చాలామంది పుట్టారు.సుయజ్ఞుడు ఇంద్ర పదవిని అలంకరించాడు.ఉపేంద్రుడు లాగా కష్టాలు తొలగించి ప్రజలను కాపాడాడు.మనువుకు చాలా సంతోషమయింది తన మనవడి గొప్పదనంచూసి.అతను తన మనవడు గొప్ప పుణ్యాత్ముడని కొనియాడాడు.సుయజ్ఞుడు సాక్షాత్తు భగవంతుడే అని నమ్మి కొనియాడాడు.అందువలన సుయజ్ఞుడు,జ్ఞాననిథి,అవతారమూర్తి అయ్యాడు.ఇది సుయజ్ఞ అవాతార కథ.

No comments:

Post a Comment