Sunday, 21 December 2025
బ్రహ్మ నారదుల సంవాదము
ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరకు పోయాడు.బ్రహ్మను స్తుతించడం మొదలు పెట్టాడు.తండ్రీ!నీవు చతుర్ముఖుడవు.వేల్పులలో మొదటివాడవ.ునాలుగు వేదాలు నీ నాలుగు ముఖాలనుండే వెలువడ్డాయి.భారతీదేవి నీ ఇల్లాలు.నీవు జ్ఞానివి.నీకు తెలియనిదంటూ ఏమీ లేదు.నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.వాటిని నీవు తీరుస్తావని ఆశగా నీ దగ్గరకు వచ్చాను.
ఈ సర్వ సృష్టిని ఎవరు ప్రారంభించారు?దీనికి ఆథారము ఏంది?కారణాలు ఏంది?దీనికంతటికీ నీవే కారణం అని నేను అనుకుంటున్నాను.నిజమేకదా!లేక నీకంటే ఘనుడు,పరాత్పరుజు ఇంక వేరే ఎవరైనా ఉన్నారా?
నీవు సృష్టి కర్తవు కదా!ఏమి లాభంకోరి ఇదంతా సృష్టించావు?ఈ ప్రాణికోటి అంతా ఎక్కడ పుజుతున్నది?ఎక్కజ లయమవుతున్నది?నీవు చాలా ఉచ్ఛమయిన పదవిలో ఉన్నావు కదా!నీవే చాలా గొప్పవాడివి.అట్లాంటిది,నీవు ఇంకెవరి గురించి తపస్సు చేసావు?నా ఈ ఆనుమానాలు అన్నీ నాకు అర్థం అయేరీతిలో చెప్పేది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment