Friday, 19 December 2025
బ్రహ్మ జవాబు
బ్రహ్మ నారదుడు అడిగిన ప్రశ్నలు అన్నీ ఓపికగా విన్నాడు.ఇలా జవాబు చెప్పాడు.
నాయనా!నారద!ఈ విశ్వాన్ని పాలించే,నియంత్రించేటంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు.శ్రీహరి నాకంటే చాలా గొప్పవాడు.అతని ఆదేశాల ప్రకారమే మేమంతా నడుచుకుంటాము.మేమంతా ఎవరెవరు అని కదా నీ అనుమానం.చెబుతాను విను.సూర్యుడు,చంద్రుడు,గ్రహములు,నక్షత్రములు..।ఇంతెందుకు?ఈ విశ్వంలోని అణువణువు అతని ఆథీనంలో ఉంది.అతని ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది.ఆ అందరిలో నేనూ ఒకడిని,అంతే!అతని నియామకంలోనే నేను సృష్టిని నడుపుతున్నాను.నేను నిమిత్తమాత్రుడిని.
ఇది తెలుసుకోలేనివారు నేనే లోకేశ్వరుడిని అనుకుంటున్నారు.నాకు నవ్వు వస్తుంది.సృష్టి,స్థితి,లయకారకుడు ఆ విశ్వాత్మే!ఆ నారాయణుడికి నేను ఎప్పుడూ నమస్కరిస్తాను.
నీకు ఈ విషయం తెలుసా?నిజానికి భగవంతుడు నిర్గుణుడు.ఈ విశ్వాన్ని అంతా సృజించేదానికిగానూ సగుణుడు అవుతున్నాడు.అంటే అతని కోసం కాదు,మనకోసం ఆయన ఈ అవతారాలు ఎత్తుతున్నాడు.
అతను విశ్వేశ్వరుడు.విశ్వాత్మకుడు.విశ్వమయుడు.అందరికీ ప్రభువు.ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాడు.అతనికి జనన మరణాలు లేవు.ఈ విశ్వమంతా ఆయనలో నిక్షిప్తమయి ఉంది.విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు.అంటే సూక్ష్మం లో సూక్ష్మం కానీ విశ్వవ్యాపకం.
అతని లీలలు ఒకటా రెండా?కోకొల్లలు.అతని లీలావతారములు అనంతములు.కానీ నాకు తెలిసిన కొన్ని,ముఖ్యమయినవి నీకు తెలియపరుస్తాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment