Tuesday, 11 November 2025

దుర్వాసుడు శాపం తృటిలో తప్పింది

ధర్మరాజు కృష్ణుడి సహాయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. అర్జునా!నీకు గుర్తు ఉందా!మనము అప్పుడు వనవాసము చేస్తూ ఉన్నాము.దుర్యోధనుడు మనలను అవమానించేదానికి ఒక పథకం వేసాడు.దుర్వాస మహామునిని ప్రేరేపించి మన దగ్గరకు పంపాడు.అతడు తన శిష్యులు చాలా మందితో వచ్చాడు.అప్పటికే మన భోజనాలు అయిపోయి ఉన్నాయి.వాళ్ళకందరికీ భోజన సదుపాయాలు చేయమని అడిగాడు.మన దగ్గర అంత మందికి,అప్పటికప్పుడు భోజన సదుపాయం చేసేదానికి ఆహార వస్తువులు లేవని ఖచ్చితంగా తెలిసే అడిగాడు.ద్రౌపది సరే అనింది.దుర్వాసుడు సరే!మేమంతా స్నానంచేసి వచ్చేలోపల అంతా తయారు చేయండి.పెడతానని పెట్టకపోతే శపిస్తాను అని భయపెట్టాడు. అప్పుడు ద్రౌపదికి దిక్కుతోచలేదు.దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు కదా!ఆమె శ్రీకృష్ణుడిని ప్రార్థించింది.అప్పుడు ఆయన వచ్చి వంట పాత్రలలో అడుగున మిగిలిన ఒకటి రెండు మెతుకులు తిన్నాడు.వెంటనే ఆ పాత్రలు అన్నీ ఆహార పదార్థాలతో నిండి పోయాయి. దుర్వాసుడు తన శిష్యులు అందరితోటి వచ్చి భోజననానికి కూర్చున్నాడు.వాళ్ళు ఎంత తింటున్నా పదార్థాలు తరగకుండా ఉన్నాయి.అందరూ కడుపారా తిని,తృప్తిగా వెళ్ళారు.ఆ ముని శాపం నుండి మనలను అప్పుడు రక్షించింది ఆ మహానుభావుడే!అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని తలచుకున్నాడు.

No comments:

Post a Comment