Friday, 14 November 2025

శ్రీకృష్ణుడి అండా దండా ఇక లేదు!

అర్జునుడు శ్రీకృష్ణుడు తమకు చేసిన సహాయం పదే పదే తలచుకుంటున్నాడు.ధర్మరాజుతో ఇంకా ఇలా అంటున్నాడు.అన్నయ్యా!శ్రీకృష్ణుడు మనకు ఎంత జేసాడు. ఆయన చేసిన సహాయం మనము ఎప్పటికీ మరచిపోలేము.అలాంటిది అతని నిర్యాణం తరువాత కూడా నేను బ్రతికే ఉన్నాను అంటే నా పైన నాకే అసహ్యం వేస్తుంది.నేను ఎంత పాపాత్ముడినో కదా!నా పూర్వ జన్మలో ఎన్నెన్ని పాపాలు చేసానో?ఒక రకంగా నేను ఇప్పుడు నిర్వీర్యమయిపోయాను.మునుపటి శక్తియుక్తులు నా దగ్గర లేవు.అతని మరణంతో నా బలమంతా తుడిచి పెట్టుకుని పోయింది. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు నేను ద్వారక నుండి అంతఃపుర స్త్రీలను ఇక్కడకు అరణ్యమార్గంలో తీసుకొస్తూ ఉండినాను.దారిలో బోయవాళ్ళు మమ్మలను పట్టుకుని ఆపారు.అప్పుడు నేను వారిని వారించలేక ఆడదానిలాగా చేతులు ముడుచుకుని కూర్చున్నాను.నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది.నేను నేనేనా అని! అన్నయ్యా!మహామునుల శాపం వలన యదువంశం నశించింది.లెక్క పక్కా లేకుండా మద్యపానం త్రాగి,ఒళ్ళూ పాయా తెలియకుండా పరస్పరం కొట్టుకుని నామరూపాలు లేకుండా పోయారు.ఏదో నామకేవాస్తే కొద్ది మంది మిగిలారు.వాళ్ళుకూడా బలహీనులను చంపారు.బలవంతులు కూడా పరస్పర యుద్ధం చేసుకుని చావును కొనితెచ్చుకున్నారు.అంతా భగవంతుడి లీల! అన్నయ్యా!ఎప్పుడైతే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాడో,ఆ క్షణమే అంధకారం నలుమూలలా అలుముకుంది మన జీవితాలలో.ఆ రోజే కలియుగం ప్రారంభం అయింది.కలియుగం అంటే అశుభాలకు పెట్టింది పేరు కదా!

No comments:

Post a Comment