Friday, 28 November 2025
కలి పురుషుడు దాష్టీకం
పరీక్షిత్తు వృషభ రూపంలో ఉండే ధర్మదేవత,గోరూపంలో ఉండే భూమాత మాటలు వింటున్నాడు.
ఇంతలో అక్కడకు కలి పురుషుడు రాజు రూపంలో వచ్చాడు.యముడు లాగా భీతి చెందేలాగా దండహస్తుడు అయి ఉన్నాడు.దయ దాక్షిణ్యం ఇసుమంతైనా లేకుండా,విచక్షణా రహితంగా ఆ గోవు,వృషభాలను తన్నడం మొదలుపెట్టాడు.
పరీక్షిత్తు ఈ పరిణామం జీర్ణించుకోలేక పోయాడు.రధము పైన నిలుచుకుని,వింటిని సారించాడు.ఆ దుష్ట,ధూర్తుడుతో ఇలా అన్నాడు.ఓరీ నీచ దురాత్మా!వీటిని ఎందుకు తంతున్నావు?ఇవేమైనా నీకు శత్రువులా?నిన్నేమైనా వాటి కొమ్ములతో నిన్ను పొడిచాయా?నీ పైకి దూసుకుని వచ్చాయా?అట్లాంటి పనులు ఏమీ చేయలేదు కదా!ఈ భూభాగాం అంతా నా చెప్పుచేతలలో ఉంది.నేను సుపరిపాలన చేసే నా రాజ్యంలో ఇంత అన్యాయము జరగటం ఏంది?
రాజు వేషము అయితే గొప్పగా వేసి ఉన్నావు,కానీ చేసేది మాత్రం ఇలాంటి నీచ నికృష్టపు పనులా!
శ్రీకృష్ణుడు,అర్జునుడు లేరు కదా!అని ఏ ఎదవ పని చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా?భయం భక్తి లేవా?విచక్షణ,సంయమనం ఏ కోశానా లేవా?శిక్షింపరానివారిని శిక్షించేదానికి నడుము కట్టావా?అసలు నువ్వే శిక్షకు అర్హుడివి.
ఇలాంటి ఘాతుకం చూసి పరీక్షిత్తు చాలా బాధ పడ్డాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment