Saturday, 29 November 2025
ధర్మదేవత, పరీక్షిత్తు సంవాదము
పరీక్షిత్తు కలిపురుషుడిని మందలించాడు.ధర్మదేవత వైపు మళ్ళి ఇలా అన్నాడు.ఓ వృషభరాజమా!నేను కురువంశ రాజును.నా రాజ్యంలో నీవు దుఃఖించాల్సిన అవసరము లేదు.రాదు.నిన్ను విచక్షణారహితంగా తన్నిన దుర్మార్గపు రాజును ఇప్పుడే శిక్షిస్తాను.అతనిని చంపేస్తాను.నీవు ఒంటి కాలి మీద కాకుండా నాలుగు కాళ్ళ మీద నడిచేలా చేసే బాధ్యత నాది.
పరీక్షిత్తు గోమాత వంక తిరిగి ఇలా అనునయించాడు.అమ్మా!గోమాతా!నీవు శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత దిక్కులేని దానిని అయ్యాను అని చింతిస్తున్నావు.అలా దీనంగా కళ్ళలో నీరు కుక్కుకుని దుఃఖిస్తున్నావు.ఇంక నీకు ఆ అవసరము లేదు.నా బాణాలతోటి ఈ దుష్టుడిని ఇప్పుడే తుదముట్టిస్తాను.
పరీక్షిత్తు స్వాంతన వచనాలకు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత సంతోషించింది.తన మోదమును ఇలా బయటపెట్టింది.ఓ పరీక్షిత్తు మహారాజా!నీకు మేలు కలుగు గాక!ఎందుకొంటే కృూరులను,దురాత్మలను శిక్షించి సాధువులను,మంచివారిని కాపాడే కురువంశంలో పుట్టావు.మీరంతా ఇంత మంచివాళ్ళు కాబట్టే అలనాడు శ్రీకృష్ణుడు మీకోసం రాయబారం కూడా చేశాడు.
మేము అసలు ఎవరికీ అపకారం చేసేవాళ్ళము కాదు.కానీ కాలగతి మారుతున్నది.దాని ప్రభావము వలన ఏది ఎలా జరుగుతుందో మనము చెప్పలేము.మనము కాలానికి ఎదురుపోలేము.దేనిని మార్చలేము.ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది.అంతా భగవంతుడి లీల,సంకల్పము.
ఆ మాటలకు పరీక్షిత్తు ఇలా సమాథానం చెప్పాడు.అయ్యా!నీవు ధర్మదేవతవు.కృతయుగములో నీకు తపస్సు,శౌచము,దయ మరియు సత్యము అనే నాలుగు పాదములు ఉండేవి.త్రేతాయుగము వచ్చేటప్పటికి ఒక పాదము తగ్గింది.ద్వాపర యుగము వచ్చేటప్పటికి రెండు పాదాలు పోయాయి.ఇంక కలియుగము మొదలు అయ్యేసరికి ఒక్క పాదమే మిగిలింది.
మీరు చెప్పింది నిజమే!శ్రీకృష్ణుడుఉన్నన్ని రోజులు మీకు హాయిగా ఉండింది.ఎలాంటి ఇబ్బందులు,కష్టాలు లేకుండా గడచిపోయింది.ఆ పరమాత్ముడి అవతారం ముగియగానే దుష్టులు చెలరేగుతారు,శాసిస్తారు అని భూదేవి దిగులు పడుతుంది.భీతి చెందుతున్నది.మీరు భయపడవద్దు.నేను దుష్టులను తుదముట్టించి,శిక్షించి మిమ్మలను కాపాడుతాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment