Saturday, 28 February 2026
అయినవాళ్ళ యోగక్షేమాలు అడిగిన విదురుడు
ఉద్ధవుడిని చూడగానే విదురుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది.వడివడిగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు.కుశల ప్రశ్నలు అడిగాడు.ఇంక నెమ్మదిగా మిగిలిన వారి కుశలం కనుక్కోవడం మొదలు పెట్టాడు.ఎవరికైనా తనా మనా ఉండడం సహజమే కదా!
ఉద్ధవా!పుణ్యాత్ములు,శ్రీహరి భక్తులు,శత్రుమర్దనులు అయిన కుంతీ పుత్రులు క్షేమంగా ఉన్నారు కదా!బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తే అతడు బలరామ కృష్ణులు లాగా జన్మించారు కదా!వారిరువురూ క్షేమమే కదా!వసుదేవుడు,రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు,సాంబుడు,ఉగ్రసేనుడు,అక్రూరుడు,సాత్యకీ,దేవకీదేవి అందరూ కుశలమే గదా!వాసుదేవుడు,సంకర్షణుడు,అనిరుద్థుడు,చారుదేష్ణగాదులు సంతోషంగా ఉన్నారు కదా?శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల సంతానం పదిమంది.వారిలో చారుదేష్ణ,సుదేష్ణ,చారుదేహ,చారుగుప్త అనువారు ముఖ్యులు.పాండవులూ అయిదుగురూ,కుంతీదేవి కుశలమే గదా?ధృతరాష్ట్రుడు క్షేమమే గదా?అతని కొడుకులు నవ్ను సభనుంచి తరిమివేయునపుడు నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండెను.అప్పుడు నాకు కలిగిన చిత్త క్షోభ అంతా ఇంతా కాదు.దానికి కారణమయిన అతడు తప్పకుండా నరకం ఊచలు లెక్కబెడతాడు.
నీకు ఆశ్చర్యమనిపిస్తుందేమో?విదురుడు చాలా సౌమ్యుడు కదా!కోపతాపలకు అసలు చోటివ్వడు కదా!శాంతానికి మారు పేరు కదా!మరి ఇతనికి ఏంది?ఇంత కోపమేంది?ఇంత దుఃఖమేంది?అని.భగవంతుని మాయ వలన నాకు మోహము కలగకుండా ఉంటుందా?ఆ భగవంతుడే మానవరూపము దాల్చి ధర్మబద్ధులు అయిన పాండవుల పక్షాన నిలిచాడు.వాళ్ళకోసం రాయబారం చేసాడు.అప్పుడు దుష్ట దుర్యోధనాదులు ఏమి చేసారు?ఆ దేవతామూర్తిని పట్టి బంథించే దానికి ప్రయత్నం చేసారు.అతను తిరిగి వాళ్ళను ఏమీ చేయలేడని వారి థీమా.యుద్ధంలో వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఆ సభలో శ్రీకృష్ణుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాడు.వాళ్ళ దుర్భాషలన్నిటినీ మౌనంగా భరించాడు.ఆ లీలా మానుష విగ్రహుడు,ఆ పరంథామ,ఆ శ్రీకృష్ణుడు తన అగ్రజుడు అయిన బలరాముడుతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా?
విదురుడు శర పరంపరలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వేశాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment